శరద్ పవార్‌కు బిగ్ షాక్.. అజిత్ పవార్ మీటింగ్‌లో 29 మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్షం..!

by Satheesh |   ( Updated:2023-07-05 11:04:01.0  )
శరద్ పవార్‌కు బిగ్ షాక్.. అజిత్ పవార్ మీటింగ్‌లో 29 మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్షం..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై తిరుగుబాటు నేత అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు శివసేనతో పొత్తు కొనసాగిస్తూనే మరోవైపు బీజేపీ అధిష్టానంతో శరద్ పవార్ టచ్‌లోకి వెళ్లి డబుల్ గేమ్ ఆడారాని ధ్వజమెత్తారు. 2022లో ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటుకు ఏక్‌నాథ్ షిండే నాయకత్వం వహించినప్పుడు శరద్ పవార్ ఎన్‌సీపీకి చెందిన శాసనసభ్యులందరూ బీజేపీతో చేతులు కలపాలని కోరుకున్నారని చెప్పారు. ఇక, తిరుగుబాటు నేపథ్యంలో తమదే అసలైన ఎన్సీపీ అంటూ ఇవాళ పరస్పరం శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు బలప్రదర్శనకు దిగాయి.

వేర్వేరుగా సమావేశం అయిన ఇరు వర్గాలు తమకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాయి. వైబీ చవాన్ సెంటర్‌లో శరద్ పవార్ వర్గం సమావేశం నిర్వహించగా.. బాంద్రాలో అజిత్ వర్గం భేటీ అయింది. ఈ సమావేశంలో అజిత్ క్యాంప్‌లో 29 మంది ఎమ్మెల్యేలు, శరత్ వర్గంలో 14 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరో వైపు అజిత్ పవార్ వ్యాఖ్యలపై సుప్రియా సూలే మండిపడ్డారు. నా తండ్రిపై కాకుండా మీకు కావలసిన వారిపై దాడి చేయండి అంటూ విరుచుకుపడ్డారు.

Read More..

నన్నేమైనా అను.. నాన్ననంటే ఊరుకోను: అజిత్ పవార్ కు సుప్రియా సూలే వార్నింగ్

Advertisement

Next Story

Most Viewed