Odisha train accident: వందల మృతదేహాలకు పోస్ట్ మార్టం.. హృదయవిదారక దృశ్యాలు!

by Satheesh |   ( Updated:2023-06-03 07:38:04.0  )
Odisha train accident: వందల మృతదేహాలకు పోస్ట్ మార్టం..  హృదయవిదారక దృశ్యాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిషాలో ఘోర ప్రమాదానికి గురైన కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఘటన వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం రాత్రి ఒడిషాలో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు మూడు వందల మంది మృత్యువాత పడ్డారు. 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను అధికారులు పోస్ట్ మార్టం నిమిత్తం ఒడిషాలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు.

దీంతో ఆసుప్రతుల్లోని మార్చురీలు రైలు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలతో నిండిపోయాయి. వందల మృతదేహాలకు పోస్ట్ మార్టం చేసేందు డాక్టర్లు సిద్ధమయ్యారు. మరోవైపు ఆసుపత్రుల్లోని మార్చురీల వద్ద మృతుల కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. తమ వారిని కోల్పోయిన బాధలో బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపిస్తుండటంతో ఆసుపత్రుల వద్ద హృదయవిదారక దృశ్యాలు కనబడుతున్నాయి. ఇంకోవైపు ఈ ప్రమాదంలో కాళ్లు, చేతులు కోల్పోయి నిస్సహయస్థితిలో మరికొందరు బాధితులు ఆసుపత్రుల వద్ద దీన స్థితిలో ఉన్నారు.

Read more:

Coromandel express accident: రిజర్వేషన్ కోచ్‌లో కిక్కిరిసిన ప్రయాణీకులు (వీడియో)

Next Story

Most Viewed