- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కీలక వ్యాఖ్యలు చేసిన మోడీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ తన లక్ష్యాన్ని 2047 వరకు చేరుకోవాలంటే సాంకేతికతతోనే సాధ్యమని ప్రధాని మోడీ అన్నారు. రాబోయే రోజుల్లో కృత్రిమ మేధస్సు విద్యా, వైద్య, వ్యవసాయ, సాధారణ పౌరుల సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పరిష్కరించగలిగే సాధారణ పౌరుడు ఎదుర్కొంటున్న 10 సమస్యత్మాక రంగాలను గుర్తించాలని ఆయన కోరారు. ‘టెక్నాలజీతో జీవితం’ అనే అంశంపై మంగళవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని ప్రసంగించారు. 21వ శతాబ్దపు భారత్ తన పౌరులకు సాంకేతిక విజ్ఞానాన్ని అందించడం ద్వారా నిరంతరం సాధికారతను అందిస్తోందని అన్నారు.
గత కొన్నేళ్లుగా టెక్నాలజీ సహాయంతో ప్రజల జీవన విధానం సులభతరమైందని నొక్కి చెప్పారు. సాంకేతిక 2047 కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యాన్ని చేరుకోవడంలో ఉపయోగపడుతుందని చెప్పారు. డిజిటల్ విప్లవం ప్రయోజనాలు పౌరులందరికీ చేరేలా చూసేందుకు రూపొందించిన ఆధునిక మౌలిక సదుపాయాలను కూడా ప్రధాని మోడీ వివరించారు. ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన వ్యత్యాసానికి నాంది పలికేందుకు సాంకేతికతను వినియోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పన్ను చెల్లింపు ప్రక్రియ పూర్తిగా సాంకేతికను ఉపయోగించి చేయాలని అన్నారు. వన్ నేషన్-వన్ రేషన్, ఆరోగ్య సేతు, కోవిన్ యాప్, రైల్వే రిజర్వేషన్, ఇతర ప్రభుత్వ సేవల్లో సాంకేతికత ముఖ్య పాత్రను పోషిస్తుందని చెప్పారు.