డెమోక్రసీ @1950 టూ 2023: సంజయ్ రౌత్ ట్వీట్ వైరల్

by samatah |
డెమోక్రసీ @1950 టూ 2023: సంజయ్ రౌత్ ట్వీట్ వైరల్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేదే నిజమైన శివసేన అని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పందించారు. ఈ నిర్ణయంతో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ‘ ప్రజాస్వామ్యానికి నివాళి అర్పిస్తున్నాను 1950 - 2023’ అని పేర్కొన్నారు. దీనికి మరాఠీలో ప్రజాస్వామ్యం అని రాసి ఉన్న ఫ్రేమ్‌కి అడ్డంగా దండ వేసి ఉన్న పోటోను కూడా షేర్ చేశారు. ‘శివసేన ఎప్పటికీ అంతం కాదు. మహారాష్ట్ర ప్రజలు ఈ ద్రోహుల సేనను అంగీకరించబోరు. ఇది బీజేపీ కుట్ర. బాలాసాహెబ్ థాక్రే శివసేనను అంతమొందించాలనేది వారి కల. అయితే ఈ ఒక్క నిర్ణయంతో శివసేన వెనకడుగు వేయదు’ అని తెలిపారు. స్పీకర్ నిర్ణయంపై శివసేన(యూబీటీ) సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed