Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాల వల్ల 14కి చేరిన మృతులసంఖ్య

by Shamantha N |   ( Updated:2024-09-16 05:54:11.0  )
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాల వల్ల 14కి చేరిన మృతులసంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు, వరదల వల్ల ఇప్పటివరకు 14 మంది చనిపోయారు. గంగా, శారద, గాగ్రా సహా అనేక నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం మీరట్‌లోని జాకీర్ నగర్ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా మూడంతస్తుల ఇల్లు కూలి 10 మంది మృతి చెందారు. ముగ్గురు తప్పించుకోగా.. మరో ఇద్దరు చికిత్స పొందతున్నట్లు అధికారులు తెలిపారు. గోండాలో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఓ మహిళ సహా ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగి చనిపోయారు. షాజహాన్‌పూర్‌లోని నది నుండి మేకను రక్షించే ప్రయత్నంలో ఇద్దరు పిల్లలు మునిగిపోయారు. మరో నలుగురు పిల్లల్ని కాపాడినట్లు షాజహాన్ పూర్ ఎస్పీ తెలిపారు.

ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న నదులు

ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా నదుల్లో నీటి మట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాలు, కాలనీల్లోకి నీరు చేరింది. ఫుల్‌పూర్‌, కర్చానా, దారాగంజ్ లో వరదలో చిక్కుకున్న వారిని పడవలను మోహరించినట్లు అదనపు డీఎం వినయ్ కుమార్ సింగ్ తెలిపారు. 15 ప్రాంతాలకు చెందిన 1,130 మంది షెల్టర్ హోమ్‌లలో ఉంటున్నారని, జిల్లాలో దాదాపు 500 మంది వరదల కారణంగా ప్రభావితమయ్యారని ఆయన చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed