- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Brother : ‘పోర్న్’కు బానిసై.. చెల్లెలిపైనే బాలుడి హత్యాచారం
దిశ, నేషనల్ బ్యూరో : పోర్న్ వీడియోలు సమాజాన్ని పెడదారిలో తీసుకెళ్తున్నాయి. ఆ వీడియోలు చూసే వ్యసనానికి బానిసగా మారిన ఓ 13 ఏళ్ల బాలుడు సొంత చెల్లెలి (9)పై అత్యాచారం చేసి, హత్య చేశాడు. మూడు నెలల క్రితం (ఏప్రిల్ 23న రాత్రి) మధ్యప్రదేశ్‌లోని రేవా నగరంలో చోటుచేసుకున్న ఈ దారుణం ఇప్పుడు వెలుగుచూసింది. రేవా జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ కథనం ప్రకారం.. ఏప్రిల్ 23న రాత్రి సదరు బాలుడు ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూశాడు. అనంతరం ఇంట్లో తన మంచం పక్కనే నిద్రపోతున్న చెల్లెలిపై రేప్‌కు పాల్పడ్డాడు. ఈ దారుణం గురించి తండ్రికి చెబుతానని బాలిక అనడంతో భయపడిపోయిన బాలుడు.. సదరు బాలిక గొంతును నులిమేశాడు. ఆ తర్వాత తల్లిని నిద్రలేపి.. తాను చేసిన ఘోరాన్ని వివరించాడు. ఆ సమయానికి బాలిక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. దీంతో బాలుడు మరోసారి తన సోదరి గొంతు నులిమి కడతేర్చాడు.
గదిలో సర్దేసి.. డెడ్‌బాడీని పడేసి..
అనంతరం సదరు బాలుడి మరో ఇద్దరు అక్కాచెల్లెళ్లు నిద్రలేచారు. అందరూ కలిసి గదిలో నిద్రపోతున్న ప్రదేశాన్ని మార్చారు. పోలీసులను పక్కదోవ పట్టించేందుకు అలా చేసినట్లు విచారణలో వెల్లడించారు. అనంతరం బాలిక డెడ్‌బాడీని తీసుకెళ్లి తమ ఇంటి ప్రాంగణంలో పడేసి వచ్చి నిద్రపోయారు. ఏప్రిల్ 24న ఉదయం పోలీసులకు ఫోన్ చేసి తమ కూతురిని ఎవరో చంపేసి ఇంటి ప్రాంగణంలో పడేశారని ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గత మూడు నెలల్లో 50 మందిని విచారించారు. ఎన్నో సాంకేతిక ఆధారాలను సేకరించారు. ఆ కుటుంబ సభ్యుల వాంగ్మూలాలలో పదేపదే మార్పులు ఉండటాన్ని గుర్తించారు. వాటి ఆధారంగానే అసలు విషయాన్ని తెలుసుకోగలిగారు. గత 3 నెలల్లో 50కిపైగా డీఎన్‌ఏ టెస్టులు చేయగా.. బాలిక ప్రైవేట్ పార్టులో దొరికిన వీర్యం డీఎన్ఏ ఆమె సోదరుడితో సరిపోలింది. విచారణలో నిందిత బాలుడు కూడా ఈవిషయాన్ని అంగీకరించాడు. సదరు బాలుడితో పాటు అతడిని కాపాడేందుకు యత్నించిన తల్లి, ఇద్దరు అక్కాచెల్లెళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.