MEA : రష్యా-ఉక్రెయిన్ వార్‌లో 12 మంది భారతీయులు మృతి.. కేంద్రం ప్రకటన

by Sathputhe Rajesh |
MEA : రష్యా-ఉక్రెయిన్ వార్‌లో 12 మంది భారతీయులు మృతి.. కేంద్రం ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : రష్యా-ఉక్రెయిన్ వార్‌లో ఇప్పటి వరకు 12 మంది భారతీయులు చనిపోయినట్లు కేంద్రం ప్రకటించింది. చనిపోయిన వారంత రష్యా తరఫున యుద్ధంలో పాల్గొన్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ‘ఈ రోజు వరకు 126మంది భారతీయులు రష్యా ఆర్మీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ 126 మందిలో 96 మదిని రష్యా ఆర్మీ బలగాల సహకారంతో భారత్‌కు రప్పించాం. మరో 18 మంది రష్యా ఆర్మీలో పనిచేస్తూ విధుల్లో ఉన్నారు. 16 మంది గల్లంతయ్యారు.’ అని ఆయన అన్నారు. ‘తమ దేశ పౌరులను వెంటనే ఆర్మీ నుంచి డిశ్చార్జ్ చేయాలని రష్యా ప్రభుత్వాన్ని కోరాం. రష్యా ఆర్మీ తరఫున పోరాడుతూ కేరళకు చెందిన బినిల్ బాబు(32)చనిపోవడం దురదృష్టకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. రష్యా ఉన్నతాధికారులతో మా ఎంబసీ టచ్‌లో ఉంది. త్వరతగతిన బినిల్ బాబు మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. కేరళకే చెందిన మరో వ్యక్తి రష్యా ఆర్మీ తరఫున యుద్ధం చేస్తుండగా గాయపడ్డాడు. అతనికి మాస్కోలోని ఓ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. మాస్కోలోని భారత ఎంబసీ కేరళకు చెందిన ఆ ఇద్దరి కుటుంబాలతో మాట్లాడుతోంది. ఆ కుటుంబాలకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాం.’ అని జైస్వాల్ అన్నారు.

Next Story

Most Viewed