ఆవాస్ యోజన డబ్బులు అందగానే.. ప్రేమికులతో పరారైన 11 మంది వివాహితలు

by Shamantha N |
ఆవాస్ యోజన డబ్బులు అందగానే.. ప్రేమికులతో పరారైన 11 మంది వివాహితలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ మహారాజ్ గంజ్ జిల్లాలో 11 మంది వివాహితలు వారి ప్రేమికులతో జంప్ అయ్యారు. ప్రధానమంత్రి ఆవస్ యోజన కింద మహారాజ్ గంజ్ జిల్లాలో ఇటీవలే 2,350 మందికి నిధులు విడుదలయ్యాయి. అయితే, ఈ పథకం కింద సాయం పొందిన 11 మంది వివాహితలు.. తమ భర్తలు వదిలేసి లవర్స్ తో పరారయ్యారు. తొలివిడతలో భాగంగా రూ.40 వేలు చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యింది. ఇదే అదునుగా భావించిన మహిళలు తమకు నచ్చినవారితో వెళ్లిపోయారని పలువురు పోలీసులను ఆశ్రయించారు. ఈ జిల్లాలో 11 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

మహారాజ్ గంజ్ డీఎం ఆగ్రహం

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన దుర్వినియోగాన్ని మహారాజ్ గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ అనునయ్ ఝా ఖండించారు. మొదటి విడతగా జమ అయిన డబ్బుని 11 మంది మహిళలు దుర్వినియోగం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నిందితులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారును ఆదేశించినట్లు తెలిపారు. వారి నుంచి నిధులు రికవరీ చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. అయితే, ఇలాంటి ఘటన జరగడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో బారాబంకి జిల్లాకు చెందిన నలుగురు మహిళలు ఇదే విధంగా భర్తను వదిలేసి లవర్స్ తో జంప్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed