- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మరాఠాలకు10 శాతం రిజర్వేషన్: బిల్లుకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం
దిశ, నేషనల్ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య అవకాశాల్లో మరాఠా కమ్యూనిటీకి 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి బిల్లును ఆమోదించారు. మరాఠా రిజర్వేషన్లకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుడు మనోజ్ జరాంగే డిమాండ్ చేశారు. ఈ మేరకు జరాంగే మరోసారి నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో ఇతర రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు చేయకుండా తమ ప్రభుత్వం మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తుందని సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపారు. సునీల్ షుక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా రిజర్వేషన్‌ను పొడిగించారు. మహారాష్ట్రలో ఇప్పటికే ఆర్థికంగా బలహీన పడిన వర్గాలు (ఈడబ్లూఎస్)10 శాతం కోటాను కలిగి ఉండగా..ఇందులో మరాఠాలు అత్యధిక లబ్ధిదారులుగా ఉన్నారు. అంతేగాక ఇప్పటికే రాష్ట్రంలో 52శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. తాజా మరాఠా కోటా10 శాతంతో కలిపి రిజర్వేషన్లు 62 శాతానికి చేరుకోనున్నాయి.