Terror associate:జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద సహచరుడు అరెస్టు

by Shamantha N |
Terror associate:జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద సహచరుడు అరెస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాద సహచరుడిని అధికారులు అరెస్టు చేశారు. సురంకోట్ దగ్గర పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్త ఆపరేషన్ చేపట్టింది. అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని భద్రతా సిబ్బంది గమనించారు. నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడని.. అప్రమత్తమైన భద్రతాబలగాలు అతడ్ని అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. అతడి నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో, భద్రతా సిబ్బంది నిందితుల నుండి మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని మహ్మద్ షబీర్‌గా గుర్తించారు. అతడికి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ఆధారిత హ్యాండ్లర్ అజీమ్ ఖాన్‌తో టచ్‌లో ఉన్నాడని గుర్తించారు. షబీర్ కు సూరంకోట్ నుండి ఆయుధాలను సేకరించమని అజీమ్ ఖాన్ ఆదేశించాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై సమగ్రదర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

జులైలో ఇద్దరు అరెస్టు

ఇకపోతే, ఈ ఏడాది జూలైలో జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన ఇద్దరు ఓవర్ గ్రౌండ్ కార్మికులను జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. కతువాలో ఆర్మీ వాహనాలపై ఐదుగురు సైనికుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడితో సంబంధం ఉన్నట్లు వెల్లడించారు. అదేవిధంగా, ఈ ఏడాది మేలో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో ఉగ్రవాద సహచురుడ్ని అరెస్టు చేశారు. బందిపొరా జిల్లాలో అతడ్ని అరెస్టు చేయగా.. నిందితుడి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story