- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోంశాఖకు రూ.2,02,868.7 కోట్లు
దిశ, నేషనల్ బ్యూరో: బడ్జెట్-2024లో హోం మంత్రిత్వశాఖకు నిధులను పెంచారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2,02,868.7 కోట్లు కేటాయించింది. క్రితం సారితో పోలిస్తే 6,833.76 కోట్లు పెరిగాయి. 2022-23కు గానూ కేంద్రం రూ.1,96,034.94 కోట్ల కేటాయింపులు చేసిన సంగతి తెలిసిందే. సాయుధ పోలీసు దళాలకు రూ.1,32,345 కోట్లు కేటాయింపులు చేసింది. జమ్ముకశ్మీర్ ఉగ్రవాదంతో పోరాటం చేస్తున్న సీఆర్పీఎఫ్‌కు రూ.37,277 కోట్లు కేటాయించింది.
పుదుచ్చేరి పోలీసులకు రూ. 3,269 కోట్లు, ఢిల్లీ పోలీసులకు రూ.1,168 కోట్లు కేటాయించింది. లక్షద్వీప్ ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేపట్టారు దీంతో లక్షద్వీప్ కు రూ.1,490 కోట్లు కేటాయించింది. సరిహద్దు రాష్ట్రమైన లఢక్ పోలీసుకు రూ. 5,958 కోట్లు కేటాయించింది. చండీగఢ్ పోలీసులకు రూ.5,862 కోట్లు కేటాయించింది. కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూలో భద్రత కోసం రూ. 5866 కోట్లు, రూ.2,648 కోట్లు కేటాయించింది. పోలీసుల అధునీకరణకు, భద్రతా పరమైన ఖర్చులకు రూ.5,733, రూ.1,248 కోట్లను కేటాయించింది.