Nargis Fakhri:ఆ హీరోతో ఐదేళ్లు డేటింగ్ చేశా : ఫ్యాన్స్‌కు షాకిచ్చిన హీరోయిన్

by Shyam |   ( Updated:2021-09-13 01:14:25.0  )
Nargis Fakhri:ఆ హీరోతో ఐదేళ్లు డేటింగ్ చేశా : ఫ్యాన్స్‌కు షాకిచ్చిన హీరోయిన్
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ ప్రాజెక్ట్‌లతో బిజీగా లేనప్పటికీ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. పాండమిక్ టైమ్‌లో యూఎస్‌లోనే గడిపిన భామ.. తాజాగా తన ఫ్రెండ్స్ హ్యూమా ఖురేషి, ఇలియానాలను కలిసి ఎంజాయ్ చేసింది. ఈ క్రమంలో ఓ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. హీరో ఉదయ్ చోప్రాతో డేటింగ్ రూమర్స్‌పై స్పందించింది. ఉదయ్‌తో ఐదేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నానని.. ఇండియాలో తను కలిసిన మోస్ట్ బ్యూటిఫుల్ సోల్ తనేనని పొగిడేసింది.

కొందరు ఫ్రెండ్స్ తమ రిలేషన్‌షిప్‌పై ఓపెన్ కాకూడదని చెప్పారని.. అందుకే మీడియా ముందు ప్రకటించలేదని తెలిపింది. కానీ ఉదయ్‌తో ప్రేమ విషయాన్ని పర్వతాల మీదకు ఎక్కి అరిచి చెప్పాలన్నంత ఆనందం ఉండేదని, కానీ అలా చేయలేకపోయాననే రిగ్రెషన్ ఎప్పటికీ ఉంటుందని చెప్పింది. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో ఫేక్ పీపుల్ చాలా మంది ఉన్నారని, వారంతా నిజానిజాలతో సంబంధం లేకుండా ప్రచారం చేస్తారని అభిప్రాయపడింది.

Advertisement

Next Story