- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పనిచేస్తుంటే ఏడుపొస్తోంది.. ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి ఆవేదన
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై కఠినంగా వ్యవహరిస్తోంది. మొదటి నుంచి వెనకడుగు వేయడం లేదు. అటు సినీ ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నా.. విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నా ఏమాత్రం ప్రభుత్వం చలించడం లేదు. దీంతో టికెట్ల ధరల అంశం దుమారం రేపుతోంది. ఈ అంశంపై రాష్ట్రంలో రోజుకో రచ్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి స్పందించారు. రాష్ట్రంలో సినిమా హాళ్లు మూసేస్తుంటే ఏడుపొస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా తీసేవాడు, చూపించేవాడు, చూసేవాడు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. థియేటర్ యజమానులు సినిమా హాళ్లను మూసివేయవద్దని, పరిస్థితుల పట్ల అధైర్యపడవద్దని పిలుపునిచ్చారు. థియేటర్ల అంశంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), నిర్మాతల మండలి జోక్యం చేసుకోవాలని ఆర్.నారాయణమూర్తి కోరారు. టికెట్ రేట్ల ప్రభావంతో మూతపడిన అన్ని థియేటర్లు తెరుచుకునేలా సర్కార్ చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌కు ఆర్ నారాయణ మూర్తి విజ్ఞప్తి చేశారు. సినిమా పరిశ్రమపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించాలని కోరారు. సమస్యలను ముందు మంత్రులకు నివేదించి, వారి సాయంతో సీఎం జగన్‌కు తెలియజేయాలని నారాయణమూర్తి సూచించారు.