- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుప్పకూలిన కుప్పం.. నారావారి పల్లెలోనూ ఎదురు దెబ్బే..
దిశ, వెబ్‌డెస్క్ : టీడీపీ కంచుకోటగా ఉన్న చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆ పార్టీ కుప్పకూలిపోయింది. ఉన్న నాలుగు మండలాల్లోనూ వైసీపీ ప్రభంజనం సృష్టించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీని అధికార పార్టీ మట్టికరిపించింది. దీంతో కుప్పంలో చంద్రబాబుకు రాజకీయంగా గట్టి దెబ్బ తగిలినట్టయింది.
ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ గెలిచింది ఇవే..
కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు గాను వైఎస్సార్‌సీపీకి 17, టీడీపీ 2,
గుడిపల్లె 12, రామకుప్పం మండలాల్లో 16 ఎంపీటీసీ స్థానాలను అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. శాంతిపురం మండలంలో 18 ఎంపీటీసీలకు 11 చోట్ల వైఎస్సార్‌సీపీ, 1 చోట టీడీపీ గెలిచింది. మరో 6 చోట్ల ఫలితాలు రావాల్సి ఉంది.
పంచాయతీ ఎన్నికలను మించి ఫలితాలు
చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఎంపీటీసీలోనూ టీడీపీ దారుణ ఓటమి పాలయింది.
అక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాజయ్య వెయ్యి ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసింది. నాలుగు మండలాల్లో 89 పంచాయతీల్లో 75 చోట్ల వైఎస్సార్‌సీపీ, 14 చోట్ల టీడీపీ గెలవగా.. కుప్పం నియోజకవర్గంలో 85 శాతానికిపైగా పంచాయతీల్లో వైయస్సార్‌సీపీ ప్రభంజనం కొనసాగించింది.