కేసుల జగన్ నుంచి త్వరగా బయటపడాలి : RRR

by srinivas |
కేసుల జగన్ నుంచి త్వరగా బయటపడాలి : RRR
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై నర్సాపూర్ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియా తో మాట్లాడుతూ.. సీఎం జగన్ బెయిల్ విషయంలో సీబీఐ కోర్టులో సోమవారం కీలక తీర్పు వచ్చే అవకాశం ఉందని అన్నారు. వాదనలు ఇప్పటికే పూర్తి అయ్యాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కాగా సీబీఐ కోర్టులో ఏ-1గా ఉన్న ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌‌ను రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా.. తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాలన్న ఉద్దేశంతోనే పిటిషన్ వేసినట్టు తెలిపారు. కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని, ఆయన త్వరగా కేసుల నుంచి బటయపడాలనే ఈ కేసు వేశానన్నారు.

Advertisement

Next Story