సీఎం, మంత్రులకు బలుపు !

by Anukaran |
సీఎం, మంత్రులకు బలుపు !
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేత నారా లోకేశ్.. సీఎం, మంత్రులను తీవ్రమైన పదజాలంతో విమర్శించారు. సీఎంకు అధికారం తలకెక్కిందని, మంత్రులకు బలుపు పెరిగిందని మండిపడ్డారు. సోమవారం అమరావతి రాజధాని గ్రామాల్లో పర్యటించిన లోకేశ్.. రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపి మీడియాతో మాట్లాడారు. రైతులను మంత్రులు తిడుతుంటే ఆపాల్సిన సీఎం.. వారిని మరింత ప్రోత్సహించడం దారుణమన్నారు. జగన్ సీఎం అయ్యాక అభివృద్ధి ఆగిపోయిందని, అందుకే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు జగన్.. అమరావతి రాజధానికి అనుకూలమని చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed