- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజనులపై అహంకారపూరిత దౌర్జన్యాలు: నారా లోకేశ్
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా టీడీపీ యువనేత నారాలోకేశ్ ఏపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. విమర్శలు చేస్తూ.. ఇదే సమయంలో ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ..‘కర్నూలు జిల్లాలో భర్త కళ్లెదుటే గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం, గుంటూరు జిల్లాలో అప్పు తీర్చందుకు గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపిన వైసీపీ నాయకుడు, గిరిజన రిజర్వేషన్లపై జీవో-3 రద్దు చేశారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ముందు ఏపీలో ఇలాంటి వార్తలు వినాల్సి వచ్చినందుకు బాధగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ బతుకుల్లో నవోదయాన్ని తెచ్చిన తెలుగుదేశం పాలనకు, గిరిజనుల పై అహంకారపూరిత దౌర్జన్యాలకు ఆస్కారం ఇస్తోన్న వైసీపీ పాలనకు ఎంత తేడా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. కనీసం ఇకనుంచైనా గిరిజనుల పట్ల పాలకుల దృక్పథం మారాలని ఆకాంక్షిస్తూ గిరిజన సోదరులందరికీ నారా లోకేశ్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.