‘ఆ పిచ్చి పక్కన పెట్టు జగన్’

by srinivas |
‘ఆ పిచ్చి పక్కన పెట్టు జగన్’
X

దిశ, వెబ్‌డెస్క్: రైతే రాజు అనే రోజు తీసుకొస్తా అన్న సీఎం జగన్ .. అసలు రైతే లేని రోజు తీసుకొస్తున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. వివిధ పథకాల ద్వారా రైతుకి ఏడాదిలో లక్ష రూపాయిల లబ్ది అన్నారని.. ఆఖరికి విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేక అసమర్థ వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందంటూ ఎద్దేవా చేశారు.

తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఇచ్చిన ప్రతీ హామీలో మోసం. ఏకంగా ఉచిత విద్యుత్ పథకానికే మంగళం పాడే ప్రక్రియ మొదలుపెట్టారు.15 నెలల్లో జగన్ రెడ్డి గారి రైతు వ్యతిరేక నిర్ణయాల వలనే ఆత్మహత్యలు భారీ స్థాయిలో పెరిగాయి. అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇకనైనా పబ్లిసిటీ పిచ్చిని పక్కన పెట్టి రైతన్నలను కాపాడండి.’ అంటూ లోకేశ్ చురకలు వేశారు.

Next Story

Most Viewed