యూఎస్ ఓపెన్‌లో ఒసాకా ఆడేనా?

by Shyam |
యూఎస్ ఓపెన్‌లో ఒసాకా ఆడేనా?
X

దిశ, స్పోర్ట్స్: జపాన్ టెన్నిస్ స్టార్ (Tennis star) నయోమీ ఒసాకా గాయం కారణంగా సిన్సినాటీ మాస్టర్స్ వెస్టర్న్ అండ్ సదరన్ టోర్నీ ఫైనల్ నుంచి వైదొలగింది. అంతకు ముందు గురువారం జరగాల్సిన సెమీస్ నుంచి తాను వైదొలగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాలో నల్లజాతీయులపై జరుగుతున్న దాడులకు నిరసనగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే నయోమీ స్పాన్సర్ ‘నైకీ’ (Nike) సంస్థ ఒత్తిడి చేయడంతో తిరిగి శుక్రవారం సెమీస్ ఆడింది.

ఆ మ్యాచ్‌లో 6-2, 7-6 (7/5) స్కోరుతో ఎలీజ్ మెర్ టెన్స్ (బెల్జియం)పై గెలిచి ఫైనల్ చేరింది. అయితే సెమీస్‌లో రెండో సెట్ ఆడుతున్న సమయంలోనే ఆమెకు కండరాలు పట్టేశాయి. పెయిన్ కిల్లర్స్ (Pain killers) తీసుకొని ఆటను ముగించింది. అయితే తాను ప్రస్తుతం ఫైనల్స్ ఆడే స్థితిలో లేనని పేర్కొంటూ ఒసాకా టోర్నీ నుంచి తప్పుకుంది.

ఫైనల్స్‌లో నయోమీ ఆడకపోవడంతో అజెరంకాను విజేతగా ప్రకటించారు. నయోమీ గాయం కారణంగా ఆటకు దూరమవడంతో యూఎస్ ఓపెన్ 2020లో పాల్గొనడంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లంతా కరోనా భయంతో యూఎస్ ఓపెన్ ఆడటం లేదు. ఇప్పుడు గాయం కారణంగా ఓసాకా కూడా తప్పుకుంటే మొత్తం గ్రాండ్ స్లామ్ కళ తప్పడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed