నేచురల్ స్టార్ ఇక సిక్స్ ప్యాక్ లో..

by Shyam |
నేచురల్ స్టార్ ఇక సిక్స్ ప్యాక్ లో..
X

నేచురల్ స్టార్ నాని కంటెంట్ ఉన్న కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాడు. నాని సినిమాల్లో హీరో స్టోరీనే అయి ఉంటుంది. అంత బాగా కథలు ఎంచుకునే నాని… ఎప్పుడూ పక్కింటి అబ్బాయిగా కనపడెందుకే ఇష్టపడ్డారు. అందుకేనేమో నేచురల్ స్టార్ చాలా కొద్ది సమయంలోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఇన్నాళ్లు హీరో రోల్స్ చేసిన నాని V సినిమాతో సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. ఇందులో నాని నెగటివ్ పాత్రలో కనిపించనున్నాడని టాక్.

ఇదిలా ఉంటే ఇన్నాళ్లు నేచురల్ గా కనిపించిన నాని.. ఇప్పుడు తెరపై సరికొత్తగా కనిపించబోతున్నాడు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో సిక్స్ ప్యాక్ తో అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇందుకోసం లాక్ డౌన్ పీరియడ్ లో ఫుల్ వర్క్ ఔట్ చేస్తున్నాడట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా టైటిల్ పోస్టర్ ఇప్పటికే ఆకట్టుకోగా.. నాని ప్రయోగాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న టక్ జగదీష్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది.

కాగా ఇంద్రకృష్ణ మోహనగంటి దర్శకత్వంలో వచ్చిన V సినిమా విడుదల కరోనా కారణంగా వాయిదా పడగా… లాక్ డౌన్ తర్వాత విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags: Nani, Shyam singha Roy, Tuck Jagadish, V, Tollywood

Advertisement

Next Story

Most Viewed