‘నఫిస’గా నందినీ రాయ్.. ‘షూట్ ఔట్’ లుక్

by Shyam |
‘నఫిస’గా నందినీ రాయ్.. ‘షూట్ ఔట్’ లుక్
X

దిశ, వెబ్‌డెస్క్ :
గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘షూట్ ఔట్’(ఎట్ ఆలేరు). రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న సిరీస్‌లో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో నందిని రాయ్ కనిపించబోతుంది. నఫిసాగా తన లుక్ రిలీజ్ కాగా.. ‘మీరు తప్పించుకోలేరు, ఆమె మనోహరమైన మనసుకు బలై పోతారు’ అంటూ తన క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. కాగా డిసెంబర్ 25న జీ5లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది.

ఆనంద్ రంగ డైరెక్షన్‌లో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో.. అక్తర్ అనే గ్యాంగ్‌స్టర్, మక్కా మసీద్ బ్లాస్ట్ జరిగిన రోజునే ప్రతీ ఏడాది ఒక పోలీస్ ఆఫీసర్‌ను చంపుతూ ఉంటాడు. తర్వాత పోలీసులు అక్తర్‌ను ఎన్ కౌంటర్ చేస్తారు. అయినా సరే, కొన్నేళ్ల తర్వాత మళ్లీ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. దీంతో ఐజీ ప్రవీణ్ చంద్.. ఇందులో అక్తర్ ప్రమేయం ఉందని అనుమానిస్తాడు. మరి చనిపోయిన అక్తర్ ప్రమేయం ఉంటుందా? అతను బతికే ఉన్నాడా? అన్నది స్టోరీ.

Advertisement

Next Story