బరిలోకి బాలయ్య.. జగన్ పాలనపై సంచలన వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2021-02-07 09:10:24.0  )
బరిలోకి బాలయ్య.. జగన్ పాలనపై సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. నెల్లూరు జిల్లా టీడీపీ నేతలతో ఆదివారం ఫోన్లో సంభాషించిన ఆయన.. బోయపాటి దర్శకత్వంలో వస్తున్న సినిమా తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించారు.

ఏపీలో అరాచక పాలన నడుస్తోందని, ఇలాంటి పాలనను తానెప్పుడు చూడలేదని వ్యాఖ్యానించారు. యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో రాక్షస పాలన నడుస్తుందని విన్నానని, ప్రస్తుతం నేరుగా చూస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో రోడ్లమీదకు వస్తానని, ప్రజలందరినీ కలువనున్నట్లు బాలయ్య వెల్లడించారు. ఇదిలాఉండగా, బాలకృష్ణ రంగంలోకి దిగితే ఏపీలో టీడీపీ మైలేజ్ పెరిగే ఛాన్స్ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story