- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలలకు రెక్కలు తొడగండి : నమ్రత
దిశ, వెబ్‌డెస్క్ :
సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా, మహిళామణులు అనేక రంగాల్లో రాణిస్తున్నా.. ఇప్పటికీ భ్రూణహత్యలు, ఆడపిల్లల అమ్మకాలు, సమాజంలో వారి పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. అందుకే మగపిల్లలతో పాటు ఆడపిల్లలకు కూడా సమానమైన ప్రపంచం ఉండాలంటూ సూపర్ స్టార్ మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ అంటోంది. ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్’ సందర్భంగా నమత్రా సోషల్ మీడియాలో తన గారాలపట్టి సితారతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ఓ మంచి మెసేజ్ అందించారు.
‘ధైర్యానికి, సంకల్పానికి, నిబద్దతకు, ప్రేమ త్యాగానికి ప్రతీకగా నిలిచే ఆడపిల్లలను పంజరంలో బంధించకుండా, వారి కలలకు రెక్కలు తొడగండి. అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. ఆడపిల్లల సాధికారితే.. మన భవిష్యత్ సాధికారిత అని గుర్తెరగాలి. మన ఇంటి ఆడపిల్లను చూసి గర్వపడండి. నేను నా సితారను చూసి గర్వపడుతున్నాను’ అని నమ్రత తన మనసులోని భావాలను పంచుకుంది.
ఇక శనివారం వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా.. ‘30 రోజుల’ మెంటల్ డే హెల్త్ చాలెంజ్ అంటూ నమ్రతా విసిరిన చాలెంజ్ గురించి తెలిసిందే. ‘వర్క్ ఫ్రమ్ హోమ్, కంప్యూటర్, టీవీ, మొబైల్ తెరల వాడకం పెరగడం, వ్యాయామం చేయకపోవడం వంటివన్నీ కూడా మానసికి ఒత్తిడిని పెంచేవే. అందుకే ఈ 30 రోజుల ప్రణాళిక అంటూ, దీన్ని అందరూ ట్రై చేస్తే.. మంచి ఫలితాలు వస్తాయని తెలిపింది నమ్రత.
View this post on InstagramA post shared by Namrata Shirodkar (@namratashirodkar) on