- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెబ్‌లో ‘వరల్డ్ వార్’ మొదలెట్టనున్న కింగ్
దిశ, సినిమా: కింగ్ నాగార్జున ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ఎక్స్‌పరిమెంట్స్ చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యేందుకు ఓటీటీ బాట ఎంచుకున్నారు. త్వరలోనే ఓటీటీ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు నాగ్. ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆయన.. వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టేందుకు ప్లాన్ చేసినట్లు తెలిపారు.
‘వరల్డ్ వార్ 2’ లేదా ‘1980లో సెట్ చేసిన టైమ్ ట్రావెల్ స్టోరీ’ని ఇందుకోసం ఎంచుకోనున్నట్లు వెల్లడించారు. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనిపిస్తే అదే కథతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఎంటర్ అయ్యే అవకాశముందన్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ అభిషేక్ బచ్చన్, షాహిద్ కపూర్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓటీటీ బాటపట్టగా.. ఇప్పుడు టాలీవుడ్ నుంచి వెబ్ వరల్డ్‌లోకి వెళ్తున్న ఫస్ట్ హీరో నాగార్జునే కావడం విశేషం.