నాగర్ కర్నూలు కలెక్టర్‌గా ఎల్ శర్మన్

by Shyam |
నాగర్ కర్నూలు కలెక్టర్‌గా ఎల్ శర్మన్
X

దిశ, మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా ఎల్.శర్మన్ నియామకం అయ్యారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం రాత్రి చేపట్టిన ఐఏఎస్‌ల బదిలీలో భాగంగా ఆయనకు నాగర్ కర్నూలు జిల్లా పాలనాధికారిగా పోస్టింగ్ ఇచ్చింది. గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్ శ్రీధర్‌ బదిలీ అనంతరం వనపర్తి జిల్లా కలెక్టర్ యస్మిన్ బాషాకు నాగర్ కర్నూలు జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం శర్మన్ పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో ఈయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు.

Advertisement

Next Story