సామ్‌తో విడాకులపై స్పందించిన చై.. అదే నిజమా..?

by Shyam |   ( Updated:2021-12-14 09:32:57.0  )
sam, chai
X

దిశ, వెబ్‌డెస్క్: సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుని చాలా రోజులు అవుతుంది. కానీ నేటికీ వారికి సంబంధించిన వార్త ఏదో ఒకటి మీడియాలో చక్కెర్లు కొడుతోంది. సామ్, చై విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత.. ఆ విషయం గురించి వారు బయట ఎక్కడా మాట్లాడలేదు. సమంత మాత్రం సోషల్ మీడియాలో కొంత బాధలో ఉన్నట్లు, కొన్ని కొటేషన్ లను షేర్ చేస్తుంది. చైతన్య మాత్రం ఈ విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.

తాజాగా చైతన్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. దాంట్లో యాంకర్ మీరు ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు అని అడిగాడు. దానికి చై.. ఎలాంటి పాత్రలు చేయడానికి అయినా సిద్ధమే కానీ.. ఫ్యామిలీని మాత్రం ఇబ్బంది పెట్టే పాత్రలు చేయనని తెలిపాడు. దీంతో అభిమానులు చై ఇది ఇన్ డైరెక్ట్‌గా సమంతను ఉద్దేశించే అన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. సమంత చేసిన బోల్డ్ క్యారెక్టర్ల వల్లే ఇదంతా జరిగింది అని ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

అత్యవసరంగా డబ్బులు కావాలా.. ఇస్తానంటున్న SBI

Advertisement

Next Story