వైఎస్ ఆడిటర్ కాకపోయి ఉంటే..గొట్టంగాడని వదిలేసేవాణ్ణి: నాగబాబు

by srinivas |
వైఎస్ ఆడిటర్ కాకపోయి ఉంటే..గొట్టంగాడని వదిలేసేవాణ్ణి: నాగబాబు
X

వైఎస్సార్సీపీ, జనసేన కీలక నాయకుల ట్విట్టర్ వార్ ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ సీఎం జగన్ కీలక మిత్రుడైన విజయసాయిరెడ్డి, మెగాబ్రదర్ నాగబాబు మధ్య ట్వీట్ల యుద్ధం ముదిరి పాకానపడింది. పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చిందని, సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలేసిన వాళ్లకు రాజకీయాలెందుకు? అంటూ విజయసాయి చేసిన ట్వీట్‌కు నాగబాబు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

సాధారణమైన వ్యక్తులమని చెబుతూ, సినిమాలు, టీవీ షోలు చేయకపోతే కుటుంబాలను పోషించుకోలేమని అంటూనే… “అయినా మీకు ఆ అవసరం లేదు లెండి, మంది సొమ్ము బాగా మెక్కారు కదా. ఇంకో 1000 ఏళ్లు కాలుమీద కాలువేసుకుని హాయిగా దొంగ లెక్కలు వేసుకుంటూ బతికగలరని మాకు తెలుసు. అవార్డులు అందుకోగల పారిశ్రామికవేత్తలను జైలు పాలుచేసింది తమరి ప్రతిభే కదా.

మీరు వైఎస్సార్ ఆడిటర్ కాకపోయి ఉంటే శతకోటి గొట్టంగాళ్లలో ఒక గొట్టంగాడని వదిలేసేవాడ్ని. ఈ కరోనా టైమ్ లో నీలాంటి గొట్టంగాళ్లు నాతో ట్వీట్ చేసే బదులు, భవిష్యత్తులో ఏ జైల్లో ఎలా టైమ్ పాస్ చేయాలో ఇప్పటినుంచే ఒక షెడ్యూల్ తయారుచేసుకోవాలి… టైమ్ కలిసొస్తుంది” అంటూ ఎద్దేవా చేశారు. ఈ ట్విట్టర్ వార్ ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చను లేవదీస్తోంది.

tags: janasena, ysrcp, twitter war, nagababu, vijayasaireddy, pawankalyan

Advertisement

Next Story

Most Viewed