చిన బంగార్రాజుగా మాస్ లుక్‌లో అదరగొట్టిన చైతూ..

by Shyam |   ( Updated:2021-11-23 08:53:26.0  )
chai
X

దిశ, సినిమా : కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న సినిమా ‘బంగార్రాజు’. ఈ మూవీలో నాగార్జున టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా.. ఆయన కొడుకు చిన బంగార్రాజుగా చైతు కనిపించబోతున్నాడు. కాగా నాగచైతన్య బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ అండ్ టీజర్ రిలీజ్ చేస్తూ విష్ చేశారు మేకర్స్. సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో నాగ్ కర్రని విసురుతూ బైక్ ఎక్కే స్టైల్ అద్భుతంగా ఉండటం తెలిసిందే.. అదే తరహాలో చైతుని కూడా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. కలర్ ఫుల్ డ్రెస్, రొమాంటిక్ స్మైల్, యూనిక్ స్టైల్‌తో అదరగొట్టిన చైతు.. అభిమానులను ఆకట్టుకున్నాడు. కాగా ఈ చిత్రంలో నాగార్జునకు జోడిగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైకి జోడీగా బ్యూటిఫుల్ కృతి శెట్టి కనిపించబోతోంది.

సమంత ఎలాంటిదో నాకు అంతా తెలుసు.. స్టార్ యాక్టర్

Advertisement

Next Story