లాక్‌డౌన్ వద్దా?.. అయితే అక్కడికి వెళ్లండి!

by Shyam |
లాక్‌డౌన్ వద్దా?.. అయితే అక్కడికి వెళ్లండి!
X

దిశ, సినిమా : లాక్‌డౌన్ విధిస్తారా? లేదా?.. కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా? లేదా?.. యాక్టివ్ కేసులు ఎన్ని? కరోనా మరణాలు ఎన్ని? రికవరీ రేట్ ఎంత?.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. ఈ క్రమంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తాత్కాలిక లాక్‌డౌన్ విధించగా.. తెలంగాణలో ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండు వారాల పాటు సెల్ఫ్ లాక్‌డౌన్ చేసుకుంటేనే మంచిదని సలహా ఇచ్చాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇలా చేస్తే మెడికల్ సిబ్బందికి హెల్ప్ చేసిన వాళ్లమవుతామని తెలిపాడు.

రెండువారాల పాటు మనం ఇంట్లోనే ఉంటే, గత నెల రోజులుగా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న వైద్యులకు కాస్త విశ్రాంతి ఇచ్చినట్లు ఉంటుందన్నాడు. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టేవాళ్లు, ఒక్కసారి ఆస్పత్రికి వెళ్లి చూస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం అవుతుందన్నారు. వైద్య సిబ్బంది జనాల ప్రాణాలను కాపాడేందుకు ఎంత కష్టపడుతున్నారు.. విరామం లేకుండా పనిచేస్తూ పడుతున్న బాధలేంటో అవగతం అవుతుందన్నారు నాగ్ అశ్విన్. సెల్ఫ్ లాక్‌డౌన్, వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా మన బాధ్యత నిర్వర్తిద్దామని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story