- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నయీమ్ డైరీస్ దర్శకుడు దిష్టిబొమ్మ దగ్ధం..
దిశ,తిరుమలగిరి: నయీమ్ డైరీస్ సినిమాలో దర్శకుడు దాము బాలాజీ విప్లవ గాయని బెల్లి లలితను అసభ్యంగా చిత్రీకరించేందుకు నిరసనగా యాదవ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో డైరెక్టర్ దాము బాలాజీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. యాదవ జాగృతి సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు దయా యాదవ్ మాట్లాడుతూ.. నయీం డైరీస్ సినిమాలో నరహంతక నయీం, ఉద్యమ గాయని బెల్లి లలితక్క మధ్య అసభ్యకరమైన సన్నివేశాలను చిత్రీకరించి లలితక్క నేపథ్యాన్ని కించపరిచారని చెప్పారు.
విప్లవ గాయని నేపథ్యం తెలుసుకోకుండా సినిమాలలో అసభ్యంగా ఎవరు చిత్రీకరించిన వారిని యాదవ జాగృతి వదిలిపెట్టదని హెచ్చరించారు. ఆ సన్నివేశాలను వెంటనే తొలగించి యావత్ తెలంగాణ సమాజానికి , బెల్లి లలిత కుటుంభానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై పోలీస్ యంత్రాంగం స్పందించి. నయీమ్ డైరీస్ సినిమాను నిలిపివేసి, దర్శకుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో యాదవ సంఘం యూత్ రాష్ట్ర నాయకులు కడారి స్టాలిన్, తిరుమలగిరి పట్టణ యాదవ సంఘం అధ్యక్షుడు వెంకన్న, మాజీ ఎం.పి.పి. కొత్తగట్టు మల్లయ్య, ఎం.ఆర్.పి.ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు కందుకూరి సోమయ్య, కడెం లింగయ్య, కందుకూరి ప్రవీణ్, నాయిని క్రిష్ణ, ప్రకాష్, సాయి, చందు, కడెం మల్లయ్య, పనికర యాదగిరి, కుర్ర శీను, బాలకృష్ణ, రాకేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.