- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ 100 శాతం సీఎం అభ్యర్థే
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ 100 శాతం సీఎం అభ్యర్థి అని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు జనసేన ముఖ్యనేత, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్ నాయకత్వం రాష్ట్రానికి అవసరమని, నిజాయితీగా ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసే పవన్ లాంటి నాయకుడు అవసరమన్నారు.
తిరుపతి ఉపఎన్నిలో జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి తరపున వచ్చే వారం పవన్ రోడ్ షో నిర్వహిస్తారని మనోహర్ స్పష్టం చేశారు. రోడ్ షో తర్వాత బహిరంగ సభ ఉంటుందని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు మనోహర్ సూచించారు. తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలన్నారు.
హాట్‌టాపిక్‌గా మారిన సోము వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్‌ను సీఎంగా చూడటమే తమ లక్ష్యమని, మోదీకి పవన్ అంటే చాలా ఇష్టమని ఇవాళ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఖచ్చితంగా పవన్‌ను ఈ రాష్ట్రానికి అధినేతగా చూస్తారన్నారు.