- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ మాస్క్ ధరిస్తే.. పాటలు వినొచ్చు!
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నేపథ్యంలో.. ప్రజలందరూ శానిటైజర్ రాసుకోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడంతో పాటు యూవీ స్టెరిలైజర్, డిస్‌ఇన్‌ఫెక్ట్, పల్స్ ఆక్సీమీటర్, ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్ వంటివి ఉపయోగించడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా ముఖానికి మాస్క్ ధరించడం అలవాటైపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మార్కెట్‌లో రకరకాల మాస్క్‌లు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ కంపెనీ.. కొత్త తరహా ఎన్95 మాస్క్‌ను తయారు చేసి లాంచ్ చేసింది. దాని సహాయంతో వినియోగదారులు కాల్స్ మాట్లాడుకోవడమే కాదు, సాంగ్స్ కూడా వినొచ్చు.
హబుల్ కనెక్టెడ్ అనే ఓ కంపెనీ ‘మాస్క్‌ఫోన్’ పేరుతో కొత్త తరహా ఎన్95 మాస్క్‌ను తయారు చేసింది. ఈ మాస్క్‌కు ఇయర్‌ఫోన్స్, మైక్రోఫోన్ అటాచ్ చేసి ఉంటాయి. హబుల్ కనెక్ట్ యాప్ ద్వారా ‘ఇయర్ ఫోన్స్’ను ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్ మాట్లాడానికి, పాటలు వినడానికి అనువుగా కంపెనీ వీటిని రూపొందించింది. పాస్/ప్లే, ఇంక్రీజ్, డిక్రీజ్ బటన్లు కూడా మాస్క్‌కు అందించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే.. ప్లే టైమ్ 12 గంటల వరకు వస్తుంది. డైరెక్ట్ వాయిస్ యాక్టివేషన్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. సిరి, గూగుల్ అసిస్టెంట్‌లా దీన్ని వాడుకోవచ్చు. అంటే మాస్క్ ఫోన్ యూజర్లు.. స్మార్ట్ హోమ్ అప్లియెన్స్‌స్‌ను కూడా కంట్రోల్ చేయవచ్చు.
ఈ మాస్క్‌లో పీఎం 2.5, ఎన్95/ఎఫ్ఎఫ్‌పీ2 ఫిల్టర్లు ఉన్నాయి. వీటికి ఇయర్ ఫోన్స్, మైక్రోఫోన్ ఉన్నాయి కదా.. మరి వాష్ చేసుకోవచ్చా? అంటే భేషుగ్గా చేసుకోవచ్చు. ఈ మాస్క్ ధర 49 డాలర్లు (దాదాపుగా రూ.3600). ప్రస్తుతం అమెరికా మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈ మాస్క్.. ఇండియాలో త్వరలోనే లభ్యం అయ్యే అవకాశం ఉంది.