తల్లి,కూతుళ్ల మృతి కేసులో వీడిన మిస్టరీ.. అంతా ఆయన పనే

by Sumithra |   ( Updated:2021-07-17 03:30:17.0  )
తల్లి,కూతుళ్ల మృతి కేసులో వీడిన మిస్టరీ.. అంతా ఆయన పనే
X

దిశ,కంటోన్మెంట్: తల్లి , కూతుళ్లు అనుమానాస్పదంగా మృతిచెందిన కేసులో బోయిన్‌పల్లి పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.. రాజస్థాన్ హనుమానుడ్ జిల్లా నోహార్ గ్రామానికి చెందిన విజయ్ భారీటియా ( 41 ) రాణిగంజ్ లోని ఓ సేఫ్టీ సామాగ్రి డిస్ట్రిబ్యూటింగ్ దుకాణంగా ఏజెంట్, అతనికి భార్య స్నేహ ( 40 ) , కవలలు హన్సిక ( 15 ) , వర్షిక ( 15 ) కుమారుడు వీరి ( 10 ) లు ఉన్నారు. పిల్లలు న్యూ బోయినపల్లిలోని పల్లవి మోడల్ స్కూల్ లో చదువుతుండడంతో విజయ్ తన కుటుంబంతో కలిసి గత ఆరేళ్లుగా పాఠశాలకు సమీపంలో ఉన్న మనోవికాస్ నగర్ లో ఉంటున్నాడు.

సేఫ్టీ సామాగ్రి సరఫరా చేసే ఏజెంటుగా తొలుత ఆర్థికంగా బాగానే ఉన్న విజయ్ లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఈ విషయమై మనోవేదనకు గురైన నిందితుడు భార్య , పిల్లలను హతమార్చి తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. జూన్ 30 వ తేదీన విజయ్ కుటుంబసభ్యులతో కలిసి రాత్రి భోజనం చేశాడు. భోజనం అనంతరం విజయ్ , స్నేహ , హన్సికలు ఓ గదిలో , వర్షిక , వీర్లు మరో గదిలో నిద్రపోయారు. ఇదే అదునుగా తీసుకున్న నిందితుడు తెల్లవారుజామున నిద్రలేచి తొలుత హన్సికను గొంతు నులిమి , అనంతరం స్నేహ ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాడు. ఉదయం 7.00 గంటలకు పాల వ్యాపారి రావడంతో అతని నుంచి పాలు తీసుకున్న నిందితుడు తిరిగి ఇంట్లోకి వెళ్లాడు. మిగతా ఇద్దరు పిల్లలను హతమార్చడానికి ధైర్యం సరిపోకపోవడంతో స్వయంగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది.

ప్రతిరోజు ఉదయం ఈ కుటుంబానికి ఆలస్యంగా నిద్రలేవడం అలవాటు ఉదయం 10 గంటలకు నిద్రలేచిన వర్షిక వెళ్లి చూసేసరికి తల్లిదండ్రులు నిద్రలేవలేదు. వర్షిక టీ తయారుచేసి తల్లిదండ్రులను నిద్రలే పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు నిద్రలేవలేదు. దీంతో వర్షిక రాజస్థాన్‌లోని తన తాతయ్యకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. ఆయన కవాడిగూడలోని తన బంధువు రాకేశ్ కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు .. రాకేశ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని చూసేసరికి అప్పటికే స్నేహ , హన్సికలు మృతిచెందినట్లు గుర్తించాడు.

విజయ్ కొన ఊపిరితో ఉన్నట్లు గుర్తించిన రాకేశ్ అతడిని చికిత్స నిమిత్తం సుచిత్రలోని రష్ ఆసుపత్రికి తరలించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హన్సిక మెడపై గాయాలు కావడాన్ని గుర్తించిన పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చన్న నమ్మకానికి వచ్చిన పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడిని పలుమార్లు విచారించారు. శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో అతను నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed