కరోనా రాకముందు నుండే క్వారంటైన్ లో ఉన్న గ్రామం.. ఎందుకో తెలుసా?

by Anukaran |   ( Updated:2021-04-15 08:43:31.0  )
కరోనా రాకముందు నుండే క్వారంటైన్ లో ఉన్న గ్రామం.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఒక గ్రామం అంటే ఎలా ఉండాలి. స్కూల్స్, హాస్పిటల్స్, ఆ ఊరి నుండి ఈ ఊరికి, ఈ ఊరి నుండి ఆ ఊరికి పోయే బస్సులు.. దుకాణాలలో తిరిగే ప్రజలతో ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. కానీ మనం చెప్పుకుంటున్న గ్రామంలో ఇవేమి ఉండవు.. ఉండవు అంటే సౌకర్యాలు లేవు అని కాదు.. ఆ గ్రామ ప్రజలే మాకివేమీ వద్దు అని వెలివేశారు. ఇంకా చెప్పాలంటే కరోనా సమయంలో ఐసోలేషన్ లో, క్వారెంటైన్ లో మనం ఎలా గడుపుతున్నామో.. గత కొన్ని దశాబ్దాలుగా వీరు ఆ గ్రామంలో అలాగే బతుకుతున్నారు. ఇదెక్కడి విచిత్రం.. మనిషితో మనిషి మాట్లాడకుండా.. చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఎలా ఉండగలుగుతున్నారు? అసలు ఎందుకు వీరు ఇలా ఉన్నారు? ఆ గ్రామం ఎక్కడ ఉంది? అనేది చూద్దాం.

హిమాలయాలకు దగ్గరగా ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో పార్వతీవ్యాలీలోని మలన గ్రామం. ఆ గ్రామంలోకి వెళ్లాలంటే అంత ఈజీ కాదు. అసలు వెళ్లే అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడి ప్రజలు లోపలి కూడా అడుగుపెట్టనివ్వరు కాబట్టి. అంతెందుకు వారి గ్రామంలోని బంధువుల ఇళ్లకు తప్ప బయట గ్రామానికి వెళ్ళరు. ఇదంతా ఎందుకు ?అంటే వారి జాతిని కాపాడుకోవడానికాని చెప్తున్నారు. మలన గ్రామ దేవత ‘జంబ్లూ’. వీరు మాట్లాడే భాషను కనషీ అని అంటారు. ఈ భాష ఈ గ్రామస్థులకు తప్ప ఇతరులకు అర్ధం కాదు..కనషీ భాషలో ఎక్కువగా సంస్కృత పదాలే ఉంటారు. వీరి జాతి అంతరించిపోతుందని, దాన్ని కాపాడడం కోసమే వారు ఇలాంటి కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్తున్నారు.

ఇక ఈ గ్రామ కట్టుబాట్లు కూడా చాలా వింతగా ఉంటాయట. ఈ గ్రామంలో పుట్టిన పిల్లలకు వారు ఏ వారమైతే పుడతారా ఆ వారం పేరు పెడతారంట. ఆదివారం పుడితే ఆహ్తా అని , సోమవారం పుడితే సోనారు అని పెడతారట. గ్రామాల్లోకి ఎంతమంది అధికారులు వచ్చినా లోపలి కూడా అడుగు పెట్టనివ్వలేదంటే అతిశయోక్తికాదు. ఇక ఇటీవలే ఒక ఉన్నతధికారి పిల్లల చదువుకు ఇబ్బంది కలుగుతుందని, వారు చదువుకోకుండా ఉంటే అనాగరికులా మారతారని చెప్పడంతో అందరు ఆ గ్రామంలో ఒక పాఠశాలను కట్టించడానికి ఒప్పుకొన్నారట. ఏదిఏమైనా ఒక 10 రోజులు కరోనా వలన ఇంట్లో ఉంటేనే పిచ్చెక్కిపోతుంది… వీరు తమ జాతికోసం ఇన్నేళ్లు ఒంటరిగా ఎలా ఉన్నారో తలుచుకుంటే భయమేస్తుంది కదా!

Advertisement

Next Story