- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నా కొడుకును పోలీసులే కాల్చి చంపాలి
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కరుడు గట్టిన రౌడీషీటర్ వికాస్ దూబేపై ఆయన తల్లి సరళాదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. 8 మంది పోలీసులను చంపి తన కొడుకు తప్పు చేశాడని, వెంటనే లొంగిపోకపోతే పోలీసులే పట్టుకోని కాల్చి చంపాలని ఆమె తెలిపారు. వికాస్ దూబే పోలీసులను కాల్చి చంపిన విషయాన్ని తాను టీవీలో చూసి తెలుసుకున్నాని తెలిపింది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడిన తర్వాతే అతను నేర వృత్తిని ప్రవృత్తిగా ఎంచుకున్నాడని వివరించింది. చాలా రోజుల నుంచి తన కొడుకు వికాస్ దూబేను కలవలేదని, ప్రస్తుతం తన చిన్న కుమారుడి వద్దే లక్నోలో ఉంటున్నట్లు ఆమె అన్నారు. వికాస్ దూబే వల్ల తన కుటుంబం అవమానాలు పడడంతోపాటు తీవ్ర ఇబ్బందులను ఎదర్కొంటున్నట్లు వాపోయింది. కాగా దూబేను పట్టుకునేందుకు 25 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story