దేశానికి సేవ చేయడం నా బాధ్యత : ఆర్మీ జవాన్

by Shyam |
Army Jawan
X

దిశ, హాలియ : డ్యూటీ ఎక్కడ చేసినా దేశం కోసం, ప్రజల రక్షణ కోసమే పని చేస్తామని ఆర్మీ జవాన్ లక్ష్యనాయక్ అన్నారు. గత నాలుగేళ్లుగా జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న ఆయన.. బదిలీపై చెన్నైకి వెళ్తున్నా సందర్భంగా సరిహద్దుల కమాండ్డెంట్, జవాన్లు లక్ష్యనాయక్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం జవాన్ లక్ష్యా నాయక్ మాట్లాడుతూ నిత్యం ఉగ్రవాది, నక్సల్స్ మధ్యలో ఉంటూ ప్రాణాన్ని లెక్క చేయకుండా దేశం కోసం, ప్రజల కోసం నాలుగేళ్లు జమ్మూకశ్మీర్లో డ్యూటీ చేయాడం గర్వంగా ఉందన్నారు. ట్రాన్స్ఫర్ పై వెళ్లిన ఎప్పుడూ ప్రజల కోసమే పని చేస్తానని, దేశానికి సేవ చేయడం నా బాధ్యత అని ఆయన తెలిపారు.

Next Story

Most Viewed