- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ కొలువు!
దిశ, నర్సంపేట : రాష్ట్రంలో ఉద్యోగాలు దొరక్క యువత తంటాలు పడుతుంటే.. కొందరు నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ కొలువుల్లో చేరుతున్నారు. దుగ్గొండి మండలంలో వీఆర్‌ఏగా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించాడని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. వెంకటాపూర్ గ్రామానికి చెందిన ముత్యాల నర్సయ్య అనే వ్యక్తి వీఆర్ఏగా పని చేశాడు. అనారోగ్యం కారణంగా 2018 అక్టోబర్‌లో చనిపోయాడు. దీంతో అతడి కొడుకు ముత్యాల మల్లయ్య కారుణ్య నియామకం కింద జాబ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు క్షేత్ర స్థాయిలో వెరిఫికేషన్ చేసి, గతేడాది అక్టోబర్‌లో గ్రామ రెవెన్యూ సహాయకుడిగా మల్లయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వయసు వ్యత్యాసం..
ముత్యాల మల్లయ్య వయసు ఓటర్ లిస్ట్ ప్రకారం 48 సంవత్సరాలుగా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. నియామకానికి సమర్పించిన సర్టిఫికెట్ ప్రకారం చూస్తే అతడి వయసు 35 ఏండ్లుగా ఉంది. నియామక ఉత్తర్వులు వచ్చి ఇప్పటికే ఏడాది పూర్తయింది. కాగా, క్షేత్ర స్థాయిలో వాకబు చేయగా నేటికీ డ్యూటీ చేసే మల్లయ్య కుమారుడు ముత్యాల రాజు (26) ఉండటం గమనార్హం.
తప్పుల తడకగా మెమో..
వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలంలోని వెంకటాపుర్‌కు చెందిన ముత్యాల మల్లయ్య 1999వ సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసినట్లు సర్టిఫికెట్ సమర్పించాడు. ఆ మెమోలో హాల్ టికెట్ నెంబర్ 57 సిరీస్‌తో ఉంది. కానీ, అదే ఏడాది ఒకే స్కూల్‌లో చదివిన మిగిలిన వారి హాల్ టికెట్ల సిరీస్ 588తో మొదలైంది. అంతేకాకుండా మెమోపై జిల్లా ఉపాధి కార్యాలయం స్టాంప్ వేసి ఉంది. వాస్తవానికి మెమో వెనుక వైపు వేసి, ఇతర వివరాలు రాసి సంతకం చేయాలి. దానితో పాటుగా జిల్లా ఉపాధి కార్యాలయం స్టాంప్‌లో పిన్‌కోడ్ 506018 అని తప్పుగా ఉంది. వాస్తవంగా 506007 ఉండాలి. కాగా, ఆయన చదివిన స్కూల్ మంగపేటకు దాదాపు 100 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇవే కాకుండా ప్రొసీడింగ్‌లో కూడా ఫైల్ సంఖ్య విషయంలో స్పష్టత కరువైంది. సర్టిఫికెట్‌లలో ఒక్క తప్పిదం కూడా అధికారులు గుర్తించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
నకిలీ అని తేలితే చర్యలు :
ముత్యాల నర్సయ్య దాదాపు 30ఏండ్లుగా వెంకటాపూర్‌లో సేతు సింధిగా పని చేశాడు. రెండేండ్ల కిందట పక్షవాతంతో చనిపోయాడు. ఆ తర్వాత నర్సయ్య కొడుకు మల్లయ్య కారుణ్య నియామకం కింద దరఖాస్తు చేసుకున్నాడు. పదో తరగతి చదివినట్లుగా మెమో జతచేశాడు. ఆ సర్టిఫికేట్ పై పలు ఆరోపణలు వస్తుండటంతో దానిని ఎస్సెస్సీ బోర్డ్‌కు పంపిస్తాం.. నకిలీ అని తేలితే చర్యలు తీసుకుంటాం.
-దుగ్గొండి తహసీల్దార్ జగన్ మోహన్ రెడ్డి