క్వారంటైన్‌కు ముస్లిం మత పెద్దలు అడ్డు

by Shyam |
క్వారంటైన్‌కు ముస్లిం మత పెద్దలు అడ్డు
X

దిశ, న‌ల్ల‌గొండ‌: ఖ‌మ్మం జిల్లాలోని క్వారంటైన్‌లో ఉన్న యువకుడు అధికారుల కల్లు గప్పి, అక్కడి నుంచి తప్పించుకుని సూర్య‌ాపేట జిల్లాకు చేరుకున్నాడు. అది గుర్తించిన అధికారులు గురువారం అతన్ని పట్టుకుని తిరిగి క్వారంటైన్‌కు త‌ర‌లిస్తుండ‌గా ముస్లిం మ‌త పెద్ద‌లు అడ్డుకోవ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. క‌రోనా ల‌క్ష‌ణాలు లేకున్నా ఎందుకు క్వారంటైన్‌కు త‌ర‌లిస్తున్నార‌ని వారు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. వివరాల్లోకివెళితే..సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని చింతలపాలెం మండలం గుడిమల్కాపురంలో బషీర్ అనే యువకుడు బుధవారం ఖ‌మ్మం జిల్లా ప్ర‌భుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డు నుంచి త‌ప్పించుకుని ఇంటికి వ‌చ్చాడు. అతనికి జియో ట్యాగ్ వేయడంతో అతడు ఎక్కడున్నాడనే విషయాన్ని అధికారులు గుర్తించారు. ఆ యువకుడిని 108 అంబులెన్స్‌లో తిరిగి ఐసోలేష‌న్ సెంట‌ర్‌కు తీసుకువెళ్తుండగా, బ‌షీర్ మ‌ర్క‌జ్ వెళ్ల‌లేద‌ని, క‌రోనా ల‌క్ష‌ణాలు లేకున్నా, అతన్ని ఎందుకు ఐసోలేష‌న్ సెంట‌ర్‌కు త‌ర‌లిస్తున్నార‌ని పలువురు మతపెద్దలు అడ్డుకుని అంబులెన్స్ ఎదుట బైఠాయించారు. పోలీసుల జోక్యంతో వివాదం కాస్త సర్దుమణిగింది. కాగా, ఐసోలేష‌న్ సెంట‌ర్‌లో ఉన్న బ‌షీర్ నిన్న‌టి నుంచి వైద్య ప‌రీక్ష‌లకు నిరాక‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

Tags : corona, lockdown, quarantine escaped, boy, muslim old men stop medical force

Advertisement

Next Story