10 మంది భార్యలున్న భర్త హత్య.. చంపింది ఎవరంటే..?

by Sumithra |
10 మంది భార్యలున్న భర్త హత్య.. చంపింది ఎవరంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్ : బహు భార్యత్వం ఉన్న ఓ వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. పది మంది మహిళలను వివాహమాడిన అతడి గొంతును గుర్తు తెలియని వ్యక్తులు తెగ కోశారు. ఈ హత్యపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని భోజ్‌పురకు చెందిన జగన్‌లాల్ (52) పది మంది మహిళలను వివాహం చేసుకున్నాడు. మొదటి వివాహం తర్వాత సంతానం కలగకపోవడంతో బాలుడిని దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన వరుస వివాహాల్లో ఐదుగురు భార్యలు మరణించారు. మరో ముగ్గురు భార్యలు వదిలేసి వెళ్లారు. ప్రస్తుతం దత్త పుత్రుడుతోపాటు ఇద్దరు భార్యలు ఆయనతో ఉంటున్నాడు.

జగన్‌లాల్‌కు తాతల నుంచి సంక్రమించిన ఆస్తితో కోటీశ్వరుడు అయ్యాడు. ఆ ఆస్తిని తన దత్తపుత్రుడికి బదలాయించాలని ఇటీవలే నిర్ణయించుకోని ఆ పనులు చేపడుతున్నాడు. ఇంతలోనే అతడు హత్యకు గురవ్వడం కలకలం రేపింది. అయితే ఆ ఆస్తిపై కొందరి కన్ను పడిందని స్థానికులు పేర్కొంటున్నారు. హత్య ఎవరు చేసుంటారనే విషయమై విచారణ కొనసాగుతోందని స్థానిక పోలీసు అధికారి మనోజ్ కుమార్ త్యాగి తెలిపారు.

Advertisement

Next Story