- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాహేతర సంబంధం.. ట్రాక్టర్ ఎక్కించి హత్య
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో దారుణం జరిగింది. కొడుకు చనిపోయిన తర్వాత కోడలు మరొకరితో సంబంధం సాగిస్తున్నదని మామ, మరిది పగ పెంచుకున్నారు. ఇదే పగతో ప్రియుడిని, కోడలి పై ట్రాక్టర్ ఎక్కించి చంపేశారు.
మహరాష్ట్రలోని జల్నా జిల్లా చాపల్‌గావ్ ప్రాంతంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన మరియా (32) భర్త 10 ఏండ్ల కిందే అకాల మరణం చెందాడు. దీంతో అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న మరియాకు అదే గ్రామానికి చెందిన వివాహితుడైన హర్బక్ భగవత్(27)తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. ఇది తెలుసుకున్న హర్బక్ భార్య గొడవకు దిగేది. అటు మరియా మామ, మరిది ఇద్దరినీ హెచ్చరించారు. ఇటువంటి సంబంధం కొనసాగించవద్దని లేని పక్షంలో ప్రాణాలు తీస్తామంటూ హెచ్చరించారు.
దీంతో మార్చి 30న గ్రామం వదలి పారిపోయిన మరియా-హర్బక్ భగవత్ గుజరాత్‌కు మకాం మార్చారు. ఇది జీర్ణించుకోలేని మరియా మామా మిస్సింగ్ కేసు పెట్టాడు. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు ఏప్రిల్ 22న వారిని పట్టుకున్నారు. ఇక అనంతరం చాపల్‌గావ్‌కు తీసుకొచ్చారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరు కలిసే ఉంటున్నారు. దీంతో వారిద్దరి పై పగ పెంచుకున్న మామా బాత్ వెల్ సంపత్, మరిది వికాస్ చంపేసేందుకు పథకం వేశారు. ఇక అదును చూసుకున్న వికాస్ ఇద్దరు కలిసి బైక్ పై వెళ్తున్న సమయంలో ట్రాక్టర్‌తో ఢీ కొట్టాడు. అనంతరం వారి పైకి ఎక్కించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలు అయిన మరియా, భగవత్‌ను హాస్పిటల్ తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూనే ఇద్దరు మృతి చెందారు. దీంతో భగవత్ భార్య మామ, మరిది ల పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.