షాకింగ్ న్యూస్.. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పై హత్యా యత్నం

by Shyam |
షాకింగ్ న్యూస్.. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పై హత్యా యత్నం
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ నేత రెడ్డిగారి రవీందర్ రెడ్డి‌పై బుధవారం ఉదయం హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. కోయిలకొండ మండలానికి చెందిన రవీందర్ రెడ్డి‌కి ధన్వాడ మండలం గోటూరు‌కు వద్ద ఉన్న 30 ఎకరాల పొలానికి సంబంధించి తమ సమీప బంధువులతో గత కొన్ని సంవత్సరాలుగా గొడవలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు హైదరాబాదు జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న రవీందర్ రెడ్డి ఇంటికి వెళ్లి వేటకొడవళ్లతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. రవీందర్ రెడ్డి మరణించాడని భావించి దాడికి పాల్పడిన దుండగులు పారిపోయినట్లు సమాచారం. ప్రస్తుతము రవీందర్ రెడ్డి కోమాలో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులలో ఒకరు పోలీసులకు దగ్గరకు వెళ్లినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే రవీందర్ రెడ్డి అనుచరులు హైదరాబాద్ తరలి వెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed