- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్బు కోసం యాచకురాలిని ఏం చేశాడంటే?
దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ నగరంలో ఫిషరిస్ కార్యాలయం వెనుక భాగంలో జరిగిన గుర్తు తెలియని యాచకురాలి హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసు వివరాలను గురువారం ఎసిపి వేంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఈ నెల 11న పిషరిస్ డిపార్ట్ మెంట్ వాచ్ మెన్ గుర్తు తెలియని యాచకురాలి హత్య జరిగిన విషయంపై ఓకటవ టౌన్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని, ఎస్ హెచ్ఓ అంజనేయులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారని తెలిపారు. ముందుగా గుర్తు తెలియని యాచకురాలి వయస్సు 50 సంవత్సరాలపైన ఉంటుందని గుర్తించి వాకబు చేశారు. పాండు రంగ్ అనే 70 సంవత్సరాల వ్యక్తితో కలిసి యాచకురాలు భిక్షాటన చేసి జీవిస్తున్నట్లు గుర్తించారు.
అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా యాచకురాలు తనకు తెలియదని, అమె వద్ధ ఉన్న డబ్బుల కోసం అడిగితే ఇవ్వకపోవడంతో పిషరిస్ కార్యాలయం చీకటి ప్రదేశానికి తీసుకువచ్చి తలపై కట్టెతో కోట్టి హత్య చేసి పారిపోయినట్లు ఒప్పుకున్నాడని ఎసిపి తెలిపారు. కేసులో పాండురంగ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన ఎస్ హెచ్ ఓ అంజనేయులు, ఎఎస్ఐ గంగాధర్ గౌడ్, షకిల్ లతో పాటు కానిస్టేబుళ్లు సాయన్న, రమేష్,వంశీలను అభినందించారు.