- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేతనాల కోసం పారిశుధ్య కార్మికుల ధర్నా
by Shyam |
X
దిశ, మహబూబ్ నగర్: వేతనాలు చెల్లించాలని కోరుతూ నారాయణపేట ఆర్టీసీ డిపోలోని పారిశుద్ధ్య కార్మికులకు నిరసనకు దిగారు. గత ఎనిమిది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, జిల్లా కార్యదర్శి బాల్‌రామ్ అన్నారు. బుధవారం ఆర్టీసీ డిపో ఎదుట పారిశుధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఎనిమిది నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడం, పనిముట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న కాంట్రాక్టర్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వెంటనే వేతనాలు విడుదల చేయాలని వారు కోరారు. ధర్నాలో కార్మికులు సత్తయ్య, లక్మమప్ప, అనిత, బస్సమ్మ, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story