ముమ్మరంగా డోర్ టు డోర్ వ్యాక్సినేషన్..

by Shyam |
Door to door vaccination
X

దిశ, జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో డోర్ టు డోర్ స్పెషల్ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పటివరకు టీకా వేయించుకోని వ్యక్తులను గుర్తించి వారికి టీకాలు వేశారు. ఈ క్రమంలో కోవిడ్ నివారణ చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్ కోరారు.

థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలని, దాంతో పాటుగా భౌతిక దూరం పాటిస్తూ నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రతిఒక్కరు మసలుకోవాలని, ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ప్రవర్తించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్వో శ్రీధర్, శానిటరీ ఇన్ స్పెక్టర్ వినోద్ కుమార్, పర్యావరణ ఇన్స్పెక్టర్ సాయికిరణ్ రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed