సూపర్ ఓవర్‌ మళ్లీ సూపర్ అయింది

by Shyam |   ( Updated:2020-10-18 20:16:14.0  )
సూపర్ ఓవర్‌ మళ్లీ సూపర్ అయింది
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 36వ రెగ్యులర్ మ్యాచ్‌ టై కావడంతో సూపర్ ఓవర్‌ కూడా మళ్లీ టై అయింది. 6 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డీకాక్-రోహిత్ శర్మ స్కోరు ఛేదనలో తడబడ్డారు. పదునైన బంతులను సంధించిన షమి బ్యాట్స్‌మెన్లను కట్టడి చేశాడు. దీంతో ముంబై కూడా 5 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ మరోసారి టై గా ముగిసింది. మరో సూపర్ ఓవర్‌లో భవితవ్యం లేలనుంది.

తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ తొలి బంతిని సమర్థవంతంగా ఎదుర్కొని 1 పరుగు తీశాడు. కానీ.. రెండవ బంతి ఆడిన పూరన్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన హుడా 1 పరుగు చేయగా.. రాహుల్ మరో రెండు పరుగులు చేసి.. చివరి బంతిని బ్యాక్ షాట్ ఆడబోయి క్లీన్ బోల్డ్ అయ్యాడు. దీంతో సూపర్‌ ఓవర్‌లో పంజాబ్ కేవలం 5 పరుగులకే పరిమితమైంది.

ఆ తర్వాత 6 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై సమిష్టిగా బంతులను ఎదర్కొంది. తొలి బంతికి సింగిల్ తీసిన డీకాక్ స్ట్రైక్ రొటేట్ చేయగా.. రోహిత్ మరో పరుగు తీశాడు. ఇక మూడో బంతికి డీకాక్ మరో పరుగు తీయగా.. నాలుగో బంతి రోహిత్ డాట్ అయ్యాడు. దీంతో 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సి ఉండగా.. 5 బంతిని రోహిత్ శర్మ సింగిల్ మాత్రమే తీశాడు. ఇక చివరి బంతికి 2 పరుగులు చేయాలి. ఇదే సమయంలో క్రీజులో ఉన్న డీకాక్.. ఒక పరుగు చేసి రెండో పరుగు చేసే ప్రయత్నంలో వికెట్ కోల్పోయాడు.

Read Also…

ముంబై‌లో ఆ నలుగురు.. కొట్టిన స్కోరు 176/6

Advertisement

Next Story

Most Viewed