కశ్మీర్ రాణి కథను కాపీ కొట్టిన కంగనపై చీటింగ్ కేసు

by Jakkula Samataha |
కశ్మీర్ రాణి కథను కాపీ కొట్టిన కంగనపై చీటింగ్ కేసు
X

దిశ, సినిమా: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ముంబై పోలీసులు. ‘దిడ్డా : ద వారియర్ క్వీన్ ఆఫ్ కశ్మీర్’ రచయిత అశీష్ కౌశల్ కంగనపై కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలు చేస్తూ బాంద్రా మెట్రో పాలిటన్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సిటీ పోలీసులు కంగనపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు.

కాగా ఈ మధ్య కశ్మీర్ రాణి దిడ్డా జీవితకథను తెరమీదకు తీసుకురాబోతున్నట్లు కంగన ప్రకటించగా.. ‘మణికర్ణిక రిటర్న్స్ : ది లెజెండ్ ఆఫ్ దిడ్డా’ టైటిల్‌తో తెరకెక్కనుందనే టాక్ కూడా వినిపించింది. అయితే తన పుస్తకం ఆధారంగానే కంగన ఈ సినిమా చేస్తోందని రచయిత అశీష్ కౌశల్ ఆరోపించారు. ‘దిడ్డా : ద వారియర్ క్వీన్ ఆఫ్ కశ్మీర్’ను హిందీలోకి ‘కశ్మీర్ కి యోధ్ రాణి దిడ్డా’గా అనువదించామని, అదే కాపీని తనకు మెయిల్ చేశానని తెలిపారు. కానీ తను నమ్మకద్రోహం చేసిందని, కాశ్మీర్ రాణి సినిమాను ట్విట్టర్ వేదికగా ప్రకటించేటప్పుడు తన పుస్తకంలోని లైన్స్ వాడిందని, అంటే కథ కూడా తనదేనని కోర్టు ముందు తెలిపారు. దీంతో కోర్టు కంగనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు సూచించగా.. ఐపీసీ సెక్షన్ 405, 415, 120బి కింద ఆమెపై నమ్మకద్రోహం, చీటింగ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed