- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబైలో ఆ నలుగురు.. కొట్టిన స్కోరు 176/6
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 36వ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై తొలుత చతికిల పడ్డా.. ఆ తర్వాత మెరుపు ఇన్నింగ్స్ చేసింది. 38 పరుగులకే 3 వికెట్లను కోల్పోయిన ముంబై ఇండియన్స్.. ఆ తర్వాత నలుగురి బ్యాట్స్‌మెన్ల మెరుపు ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ ముందు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇన్నింగ్స్ సాగిందిలా:
తొలుత ఓపెనింగ్ దిగిన రోహిత్ శర్మ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. 3వ ఓవర్‌లో అర్షదీప్ రోహిత్‌ను 23 పరుగుల వద్ద అవుట్ చేశాడు. డీకాక్ అప్పటికే క్రీజులో కుదురుకొని బ్యాటింగ్ కొనసాగించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్(0) షమి బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఇక మిడిలార్డర్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ (7) పరుగులు మాత్రమే చేసి రవి భిష్నోయ్ బౌలింగ్‌లో మురుగన్ అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 38 పరుగులకే ముంబై మూడు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాతి 5వ స్థానంలో వచ్చిన కృనాల్ పాండ్యా 34 పరుగులతో రాణించాడు. 4 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి డీకాక్‌కు మంచి భాగస్వామ్యం ఇచ్చాడు. కానీ, రవి భిష్నోయ్ బౌలింగ్‌లో షాట్‌కు ట్రై చేసి దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 6వ స్థానంలో వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డీకాక్(53) భారీ షాట్ ఆడబోయి బౌండరీ వద్ద మయాంక్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 16.3 ఓవర్లలో 119 పరుగులకు ముంబై 6 వికెట్లు కోల్పోయింది.
ఇక 7,8 స్థానాల్లో వచ్చిన కీరన్ పొలార్డ్(34), కాల్టర్ నైల్(24) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. 21 బంతుల్లో ఇద్దరు కలిసి ఏకంగా 57 పరుగులు చేశారు. ముఖ్యంగా పొలార్డ్ 12 బంతుల్లోనే 1 ఫోర్, 4 సిక్సర్లతో 34 పరుగులు రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ముంబై 176 పరుగులు చేశారు.
స్కోరు బోర్డు:
1. రోహిత్ శర్మ (c)b అర్ష్‌దీప్ సింగ్ 9(8)
2. క్వింటన్ డీకాక్ (wk) c మయాంక్ అగర్వాల్ b క్రిస్ జోర్డాన్ 53(43)
3. సూర్య కుమార్ యాదవ్ c మురుగన్ అశ్విన్ b షమి 0(4)
4. ఇషాన్ కిషన్ c మురుగన్ అశ్విన్ b అర్ష్‌దీప్ సింగ్ 7(7)
5. కృనాల్ పాండ్యా c దీపక్ హుడా b రవి భిష్నోయ్ 34(30)
6. హార్దిక్ పాండ్యా c నికోలస్ పూరన్ b షమి 8(4)
7. కీరన్ పొలార్డ్ నాటౌట్ 34(12)
8. కాల్టర్ నైల్ నాటౌట్ 24(12)
ఎక్స్‌ట్రాలు: 7
మొత్తం స్కోరు: 176-6
వికెట్ల పతనం: 23-1 (రోహిత్ శర్మ, 2.5), 24-2 (సూర్యకుమార్ యాదవ్, 3.3), 38-3 (ఇషాన్ కిషన్, 5.1), 96-4 (కృనాల్ పాండ్యా, 13.5), 116-5 (హార్దిక్ పాండ్యా, 15.3), 119-6 (క్వింటాన్ డీ కాక్, 16.3)
బౌలింగ్:
1. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 4-0-24-0
2. మహ్మద్ షమి 4-0-30-2
3. అర్ష్‌దీప్ సింగ్ 3-0-35-2
4. క్రిస్ జోర్డాన్ 3-0-30-32
5. మురుగన్ అశ్విన్ 3-0-28-0
6. దీపక్ హుడా 1-0-9-0
7. రవి భిష్నోయ్ 2-0-12-1