అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

by Shamantha N |   ( Updated:2021-10-22 04:59:39.0  )
అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి
X

దిశ, వెబ్‌‌డెస్క్: మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ముంబై లాల్‌బాగ్‌ ప్రాంతంలోని అవిగ్యాన్‌ పార్క్‌ సొసైటీలో ఓ అపార్ట్‌మెంట్‌ 19వ అంతస్తులో మంటలు చెలరేగాయి. భారీ మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుపోయింది. మంటల నుంచి తనను తాను రక్షించుకునే క్రమంలో ఓ వ్యక్తి భవనంపై నుంచి కిందపడిపోయాడు. దీంతో అక్కడికక్కడే మరణించాడు. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 12 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Next Story