- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తౌక్టే తుఫాన్ : ముంబై ఎయిర్ పోర్టు మూసివేత
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తౌక్టే తుఫాన్ దేశాన్ని గజగజలాడిస్తుంది. ఓ పక్క కరోనా విలయతాండవం చేస్తుంటే.. మరోపక్క ఈ తుఫాన్ విజృంభించడం ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే ఈ తుఫాన్ కేరళ, కర్ణాటక రాష్ట్రాలను ముంచెత్తింది. భారీ వర్షాలకు ఈ రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం తీవ్రమైన తుఫాన్ గా మారి గుజరాత్ వైపు పయనిస్తోంది. ఈ నేపథ్యంలోనే తుఫాన్ కారణంగా ముంబై ఎయిర్ పోర్టు ను అధికారులు మూసివేశారు. సోమవారం సాయంత్రానికి తౌక్టే తుఫాన్ గుజరాత్ తీరాన్ని తాకనుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు పోర్ బందర్, మహువా ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు లక్షన్నర మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ తీవ్రత చాలా అధికంగా ఉంటుందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.