బహుళ మేధస్సు దయానంద్ సొంతం

by Shyam |   ( Updated:2021-08-14 06:36:33.0  )
బహుళ మేధస్సు దయానంద్ సొంతం
X

దిశ, నిజామాబాద్ సిటీ: మాజీ జర్నలిస్టు, హక్కుల కార్యకర్త న్యాయవాది గడ్డం దయానంద్ మేధస్సు, వివిధ రంగాల్లో పూర్తి అవగాహన, విజ్ఞానంతో కూడిన ఉన్నటువంటి బహుళ మేధస్సు దయానంద్ సొంతమని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎం రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్ గడ్డం దయానంద్ సంస్మరణ సభను సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నగర కమిటీ ఆధ్వర్యంలో నగర కార్యదర్శి పరుచూరి శ్రీధర్ అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కోర్టులో వివిధ సిద్ధాంతాలతో ఉన్నటువంటి న్యాయవాదులతో స్నేహం, అవగాహనా చర్చించడం లాంటి వ్యక్తినీ మళ్లీ చూడలేమని, గొప్ప ఆలోచన విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అని కొనియాడారు.

మరో వక్త రాష్ట్ర మానవ హక్కుల వేదిక అధ్యక్షులు గొర్రెపాటి మాధవరావు మాట్లాడుతూ దయానంద్ లాంటి అరుదైన వ్యక్తినీ ఇక చూడలేమని విశాల దృక్పథం, విశాల ఆలోచన, విశాల అవగాహన కలిగినటువంటి గొప్ప వ్యక్తి అని, తన కాళ్ళపై తాను నిలబడాలని తన కష్టం ద్వారా ఏదైనా సాధించాలనే తపన ఆయన లో ఉండేదని గుర్తు చేశారు. జిల్లా కోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఏం రాజిరెడ్డి మాట్లాడుతూ సమ సమాజ నిర్మాణంలో తనదంటూ ముద్రవేసుకున్న వ్యక్తి జిల్లాలో మీడియా రంగంలో కానీ హక్కుల రంగంలో గాని న్యాయవాద వృత్తిలో గానీ ప్రతిచోటా ఎంతోమంది స్నేహితులను సంపాదించుకున్న గొప్ప వ్యక్తి అని, ఆయన చీమకు కూడా హాని తలపెట్టని వ్యక్తి అని అన్నారు. ఈ సభలో నాయకులతోతోపాటు కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed